ఆత్మ క‌థ రాస్తున్న సోనూసూద్.. ఒక అధ్యాయం మొత్తం క‌ర్నూలు రైతు గురించేన‌ట‌!

ఆస్తులను తాకట్టు పెట్టి మరీ రూ.పది కోట్ల రుణం తీసుకుని ఆపన్నులను ఆదుకుంటున్న సోనూ సూద్‌ను ప్రపంచం మొత్తం వేనోళ్ల కొనియాడుతోంది. ఈ క్రమంలో తన అనుభవాలతో సోనూ ‘నేను దేవదూతను కాదు.. (అయామ్‌ నాట్‌ మెసయ్య)’ అనే పేరిట ఆత్మకథ రాసుకున్నారు.అందులో ఓ అధ్యాయమంతా ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె అమ్మాయిలు, వారి తండ్రికే కేటాయించడం విశేషం. ‘నా మనసు పొరల్లోని పేజీలను తిరగేస్తూ ఉంటే.. ఈ ఏడాది జూలై 25న ఓ దృశ్యం నా దృష్టిని ఆకర్షించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ టమోటా రైతుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను ఓ జర్నలిస్టు అప్‌లోడ్‌ చేశారు. నాగలికి ఎద్దులను బదులు రైతు తన కుమార్తెలను ఉపయోగించడం చూశాను. ఆ దృశ్యం చూసి షాకయ్యాను. ఆ అమ్మాయిలు ఉండాల్సింది స్కూల్లో.. ఇలా నాగలి మోస్తూ పొలంలో కాదన్నారు.

కానీ కరోనా సృష్టించిన దుర్భర పరిస్థితికి ఇది నిలువెత్తు నిదర్శనం. కొన్ని గంటల్లోనే వివరాలు తెలిశాయి. రైతు నాగేశ్వరరావుకు ఫోన్‌ చేశాను. వెంటనే ఎడ్లు పంపుతానని మాటిచ్చాను. అయితే ఇప్పుడా కుటుంబానికి అవసరం ఎడ్లు కాదని.. ట్రాక్టరు అని నాకు అర్థం కావడానికి కొన్ని క్షణాలు పట్టింది. మర్నాడు ఓ ట్రాక్టర్‌ను ఇస్తానని చెప్పాను. చండీగఢ్‌లోని నా మిత్రుడు కిరణ్‌ గిల్హోత్రాకు ఫోన్‌ చేశాను. ఆయన అక్కడి ఏజెంటుకు ఫోన్‌ చేశారు. ఆ రోజు సెలవైనప్పటికీ తక్షణమే స్పందించారు. సాయంత్రం ఐదు గంటలకల్లా ట్రాక్టరు నాగేశ్వరరావు పొలంలో ఉంది’ అని సోనూ తన ఆత్మకథలో వివరించారు.

కోవిడ్ -19 మహమ్మారి విజృంభిన సమయంలో అవసరమైనవారికి సహాయం చేయడానికి అవిరామంగా, నిస్వార్థంగా కృషి చేశారు సోను సూద్. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్నో హృదయాల్లో అతడు నిలిచిపోయాడు. ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్న ఈ రీయల్ హీరో లాక్ డౌన్ లో వలస కార్మికులకు అతను చేసిన సహాయం దేశం నలుమూలల నుంచి మంచి గుర్తింపును అందించింది. వారి సొంత పట్టణాలకు సురక్షితంగా చేరుకోవడంలో సహాయపడటాన్ని ఇప్పటి కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ‘వలసదారుల మెస్సీయ’ అని ప్రతి ఒక్కరు కీర్తిస్తున్నారు. మెస్సియా అంటే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి అని అర్థం. అయితే అయామ్ నాట్ మెసయ్య అని తన ఆత్మకథకు పేరు పెట్టాడు సోనూ సూద్.