బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తోన్న అల్లుడు అదుర్స్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అంటూ ఒకటి ఉందని సోనూ సూద్ ఆ సెట్‌లోకి అడుగుపెట్టాకే నేషనల్ మీడియాకు తెలిసింది. అక్కడే సోనూ సూద్ ఉండటం, అతని కోసం అభిమానులు తండోపతండాలు రావడం జరుగుతూ వచ్చింది. అక్కడే అతను తన అభిమానులు గోడు వినడం, సాయం చేయడం వంటివెన్నో జరిగాయి. ఇలా సోనూ సూద్ వల్ల అల్లుడు అదుర్స్ సినిమా రోజూ వార్తల్లో నిలిచేది.
అయితే లాక్డౌన్ కాలంలో సోనూ సూద్ ఇమేజ్ భారీగా పెరిగింది. నడిచే దైవంలా సోనూ సూద్‌ను కొలుస్తున్నారు. ఒకప్పుడు సోనూ సూద్‌ను తెరపై విలన్‌గా చూసిన ప్రేక్షకులు ఇప్పుడు అలా చూసేందుకు ఇష్టపడటం లేదు. ఎందుకంటే సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరో. అందుకే వెండితెరపైనా సోనూ సూద్‌ను అలాగే చూపించేందుకు దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈక్రమంలోనే సోనూ సూద్‌ను పాత్రను పూర్తిగా మార్చేశారట అల్లుడు అదుర్స్ టీం.
ఈ క్రమంలో బెల్లంకొండ పాత్ర చాలా తగ్గినట్టు తెలుస్తోంది. సోనూ సూద్‌కు రెండు పాటలు కూడా పెట్టారట. సీన్స్ మొత్తం రీషూట్ చేసేశారట. తాజాగా పాటకు సంబంధించిన షూటింగ్, వాటి రిహార్సల్స్ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. మొత్తానికి సోనూ సూద్ ఇమేజ్ ముందు బెల్లంకొండ శ్రీనివాస్ నిలబడగలడా? అని అందరికీ అనుమానం కలుగుతోంది. ఈ చిత్రాన్ని సోనూ సూద్ ఇమేజ్ పెట్టి అమ్ముకోవాల్సి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.