కంగనా బురదలో పంది!.. హీరోయిన్ ట్వీట్ వైరల్

 

బాలీవుడ్ ప్రస్తుతం గరంగరంగా ఉంది. ఓ వైపు సుశాంత్ సింగ్ మరణం కేసు సీబీఐ దర్యాప్తు చేయడం, అందులో భాగంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూర్ (ఎన్‌సీబీ) దాడులు చేయడం, అరెస్ట్ చేయడం, బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాలో కలకలం రేగడం జరుగుతూ వస్తోంది. ఇంకో వైపు కంగనా రనౌత్ బాలీవుడ్, మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులతో ఒంటరిగా పోరు చేస్తోంది. కంగనాను బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ముంబైలో అడుగుపెట్టొద్దు, చంపేస్తామని మహారాష్ట్ర మంతి సంజయ్ రౌత్ బెదిరింపులకు పాల్పడ్డాడు.

Sonam KApoor satires On Kangana Ranaut Comparing With Pig

అయినా వీటన్నంటికి పూచిక పుల్లతో తీసేపారేస్తోంది కంగనా. అది ఎవడబ్బ జాగిరీ కాదు, మహారాష్ట్ర పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏమీ కాదు.. నేను ముంబైకి వస్తాను.. ఎవడు ఏం చేస్తాడో చూస్తాను అంటూ ధీటుగా సవాల్ విసిరింది కంగనా. ఇక కంగనాపై సోషల్ మీడియాలో భిన్న రకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేయడం, బాలీవుడ్‌ను ఏకి పారేస్తుండటంతో తనకు ప్రాణ హాని ఉందని రక్షణ కల్పించమని కంగనా కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.

ఇదంతా జరుగుతూ ఉంటే నెపోటిజం కిడ్ సోనమ్ కపూర్ మధ్యలో వచ్చింది. తన సోషల్ మీడియా ఖాతాలో ఓ కొటేషన్‌ను పెట్టింది. అయితే అందులో ఏ పేరు ఉద్దేశించకపోయినా.. ఆమె చెప్పాలనుకున్నదేంటో అందరికీ అర్థమైంది. నేను చాలా క్రితం ఓ విషయం నేర్చుకున్నాను.. బురదలోని పందితో పెట్టుకోవద్దు.. ఆ బురద మనమీదే పడుతుంది.. అంతేకాకుండా అలా చేయడం ఆ పందికి ఇష్టం కూడా అంటూ జార్జ్ బెర్నాడ్ షా చెప్పిన కొటేషన్‌ను సోనమ్ పోస్ట్ చేసింది. కంగాను ఉద్దేశించి ఈ పోస్ట్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.