నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈయన తదుపరి చిత్రం వీర సింహారెడ్డి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి పండుగ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యాయని సమాచారం.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ నటిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ కన్నా వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకి అధిక ప్రాధాన్యత ఉందని సమాచారం. ఇలా వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కీలకంగా ఉండడమే కాకుండా ఆమె చాలా అద్భుతంగా నటిస్తుందని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే బాలకృష్ణ అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాలో కూడా తాను నటించాలని ఆమెను అడిగారట.
బాలకృష్ణ సరదాగా ఇలా అడగడంతో ఆమె కూడా తనకు బాలకృష్ణ తదుపరి సినిమాలో నటించడానికి డేట్స్ ఖాళీగా లేవని సమాధానం చెప్పారట.ఈ విధంగా బాలకృష్ణకు ఎదురు సమాధానం చెప్పడంతో బాలకృష్ణ కూడా సరదాగా నవ్వుతూనే నా సినిమా తర్వాతే ఎవరి సినిమా అయినా చేయాలి అంటూ తనకు నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి బాలకృష్ణ, వరలక్ష్మి శరత్ కుమార్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.