ఎన్టీఆర్ బాధలో ఉన్నపుడు ఇలాంటివి అవసరమా?

ప్రస్తుతం టాలీవుడ్ ప్రైడ్ హీరోస్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలు తన కుటుంబంతో మమేకం అయ్యి ఉన్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ లాంటి హ్యూమాంగస్ సక్సెస్ తర్వాత కొన్ని నెలల పాటుగా ఆ సక్సెస్ ని తాను ఎంజాయ్ చేయడమే కాకుండా నందమూరి ఫ్యాన్స్ కూడా తలెత్తుకునేలా తారక్ చేసాడు.

కాగా ఇప్పుడు అనుకోని రీతిలో వారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన సోదరుడు నందమూరి తారక రత్న అకాల మరణంతో వారి ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. దీనితో ఎన్టీఆర్ సహా కళ్యాణ్ రామ్ మరియు బాలకృష్ణ లు అంతా కూడా తమ సినిమాల షూటింగ్ లు ప్రస్తుతానికి నిలిపివేశారు.

కానీ మరో పక్క తన సినిమా ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ గా ఎంతో కీర్తి ప్రతిష్టలు చూగొంటుంది. అయితే ఈ సమయంలో ఎన్టీఆర్ కోసం కోసం ఎవరూ మాట్లాడ్డం లేదు తనకి క్రెడిట్స్ ఇవ్వలేదు అని ఓ సెక్షన్ ఆడియెన్స్ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. బాధగా ఉన్న వ్యక్తిని కొన్నాళ్ళు కదపకుండా ఉండడం మంచిదని వారు వదిలేసారో ఏమో కానీ తమ సంతోషంలో అతన్ని కూడా వచ్చి నవ్వమంటే ఎలా ఉంటుంది?

అందుకు ఎన్టీఆర్ విషయంలో ప్రముఖులు మౌనంగా ఉన్నారు అనుకోవచ్చు కదా? అది అనుకోకపోగా ఎన్టీఆర్ ని కావాలని ఇగ్నోర్ చేస్తున్నారు. అదీ ఇది అని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్టీఆర్ మెల్లగా కోలుకున్నాక షూటింగ్స్ ఇతర అంశాల్లో పాల్గొననున్నారు.