“NTR 30” కి అదిరే టైటిల్..అనౌన్స్ కూడా అప్పుడేనట.!

గత ఏడాది గ్లోబల్ బిగ్ హిట్ చిత్రం ట్రిపుల్ ఆర్ తో ఈ సినిమా హీరోలు ఇద్దరూ కూడా వరల్డ్ వైడ్ గా అదిరే క్రేజ్ ని ఎన్టీఆర్ సహా రామ్ చరణ్ లు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న సినిమా కోసం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా అలాగే ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబినేషన్ లో కూడా రెండో సినిమాగా తెరకెక్కిస్తుండగా క్రేజీ హైప్ ఈ సినిమాపై నెలకొంది.

ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ పై అయితే ఇప్పుడు కొన్ని క్రేజీ అంశాలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రానికి స్టన్నింగ్ టైటిల్ “దేవర” అని ఫిక్స్ చేశారట. కాగా ఈ టైటిల్ ని అయితే ఎప్పుడు అనౌన్స్ చేయనున్నారో కూడా ఇపుడు తెలుస్తుంది.

ఈ మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా అయితే మేకర్స్ ఈ సాలిడ్ అప్డేట్ ని ఆరోజు అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా అదే రోజున సినిమా ఫస్ట్ లుక్ కూడా రావచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ మాస్ టైటిల్ ని ఆరోజు వచ్చే ఛాన్స్ లు చాలా ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ హిట్ బాంబ్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రం తోనే ఆమె టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. ఇక కొరటాల అయితే ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తుండగా వచ్చే ఏడాది ఈ చిత్రం ఉగాది కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.