కరీంనగర్ లో దారుణం.. ఇంట్లోకి చొరబడి తల్లి కూతుర్లపై కత్తితో దాడి చేసిన దుండగులు?

ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఇతరులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.తెల్లవారుజామునే దుండగులు ఓ ఇంట్లో చొరబడి పెద్ద ఎత్తున తల్లి కూతుర్లపై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసిన కఠిన ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించింది. అసలేం జరిగింది అనే విషయానికి వస్తే…
కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, రామకృష్ణకాలనీలో ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రామకృష్ణ కాలనీలో స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి గుజ్జుల సులోచన తన తల్లి తెల్లవారుజామున దుండగులు కత్తులతో దాడి చేశారు.ఈ దాడిలో భాగంగా దుండగులు బాధితులపై విచక్షణారహితంగా పొడవడంతో సులోచన అక్కడికక్కడే మృతి చెందిన తన తల్లి బాలవ్వ మాత్రం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా రామకృష్ణ కాలనీ ఉలిక్కిపడింది.

ఈ విధంగా వీరిపై దాడి చేసిన దుండగులు అనంతరం పరారయ్యారు. అయితే కొన ఊపిరితో ఉన్నటువంటి బాలవ్వను ఆసుపత్రికి తరలించి సరైన చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంలో గుజ్జల సులోచన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేసుకున్నారు.అయితే వీరీపై దాడికి ప్రయత్నించిన దుండగులు ఎవరు దేనికోసం వారు ఈ దారుణానికి పాల్పడ్డారు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.