సింగరేణి సంస్థలో ఉద్యోగం చేయాలనేది ఎంతోమంది కల కాగా సింగరేణి సంస్థ తాజాగా 21 మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 12 నుంచి ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలు కాగా సెప్టెంబర్ 18 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://scclmines.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. సింగరేణి సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఏడాది కాలపరిమితితో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. 64 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 21వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వైద్య విద్యలో డిగ్రీతో పాటు పీజీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అనుభవం కచ్చితంగా ఉండాలి. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. సింగరేణిలో ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయినట్లేనని చాలామంది భావిస్తారు.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు జరుగుతోంది. అన్ని అర్హతలు ఉండి సింగరేణిలో ఉద్యోగం కావాలని ఎవరైనా కోరుకుంటూ ఉంటే వెంటనే ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేకూరుస్తాయి.