వామ్మో శివకార్తికేయన్ ఒక్క సినిమాకి ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటారా?

రేమో, కౌసల్య కృష్ణమూర్తి డాక్టర్ వరుణ్ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ నటుడు శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో తెలుగు తమిళ చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

తాజాగా డాక్టర్ చిత్రం ద్వారా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న శివ కార్తికేయన్ మరో రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా శివకార్తికేయన్ రెమ్యూనరేషన్ విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది. ఈయన ఒక్కో సినిమాకు 25 నుంచి 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలియడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారికి కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందలేదు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడంతో ఎంతోమంది షాక్ అయ్యారు. ఏది ఏమైనా ఒక్కో సినిమాకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం చూస్తుంటే ఆయనకు ఎలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఎంతటి డిమాండ్ ఉందో అర్థమవుతోంది.