Tribal: గిరిజనుల కోసం ఇంటర్నెట్ సేవలు.. నెట్ లో వాళ్లు ఏం చూస్తున్నారంటే..?

అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లోని ఒక మారుమూల తెగ మొదటిసారిగా ఇంటర్నెట్ అద్భుతాలను అనుభవిస్తోంది. ఎలోన్ మస్క్ శాటిలైట్ నెట్‌వర్క్ స్టార్‌లింక్ తెగకు ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ అడవుల్లో జీవిస్తున్న Marubo గిరిజన తెగకి తొలిసారి ఇంటర్నెట్ అనుభవం దక్కింది. ఎలోన్ మస్క్ ఏర్పాటు చేసిన స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా వీరికి వైఫై కనెక్షన్ కలిగింది. ఈ మారుమూల తెగ ప్రపంచంతో కనెక్ట్ అయ్యింది. కానీ అదే ఇంటర్నెట్ ఇప్పుడు వారి సంస్కృతిని మింగేస్తోందని అక్కడి పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నెట్ వచ్చిందంటే మంచి విషయాల కోసం వాడతారనుకున్నారు. కానీ అక్కడ పరిస్థితి అలా లేదు.. అక్కడి యువత ఎక్కువగా మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టి, గంటల తరబడి పోర్న్ వీడియోలు చూస్తున్నారని, వాళ్లు కుటుంబ సభ్యులతో మాట్లాడే ఆసక్తి కూడా కోల్పోయారని కొందరు గ్రామ పెద్దలు వాపోతున్నారు. ఒక్కసారిగా పాత పద్ధతుల్లో జీవించడంలో ఆసక్తి తగ్గిపోయిందని చెబుతున్నారు.

ఈ wifi వచ్చిన తర్వాత, సాంప్రదాయంగా తయారుచేసే ఆభరణాలు, చెట్లు, పండ్ల నుంచి రంగులు తీయడం వంటి కళలు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఏకంగా కూర్చుని మనుషులతో మాట్లాడే అలవాటు కూడా మరిచిపోయారంట.. ఫోన్‌లో నిమగ్నమైపోయారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యువత సంప్రదాయ జీవనశైలిపై ఆసక్తిని కోల్పోతున్నారని గ్రామ పెద్దలు చెబుతున్నారు.

Marubo తెగకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ .. ఇంటర్నెట్ వాడాలి.. కానీ ఎలా వాడాలో కూడా తెలిసి ఉండాలి. లేకపోతే ఇది మన జాతిని మింగేస్తుందని అన్నారు. పాత జీవన శైలి మరిచిపోతూ, నూతన ప్రపంచపు బానిసలుగా మారిపోతున్న ఈ గిరిజనుల కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.