పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన సింగర్ మంగ్లీ..?

Mangli Bathukamma Song 2020

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సింగర్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో మంగ్లీ కూడా ఒకరు. జానపద గాయకురాలు అయిన మంగ్లీ తన జానపద గీతాలతో ప్రజలను ఆకట్టుకొని వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. జానపద గాయకురాలిగా గుర్తింపు పొందిన మంగ్లీ కి ఆ తర్వాత సినిమా పాటలు పాడటానికి కూడా అవకాశాలు లభించాయి. ఇలా జానపద గీతాలు నుండి పాన్ ఇండియా సినిమాలలో కూడా తన అద్భుతమైన ఘాత్రంతో పాటలు పాడి మంచి గుర్తింపు పొందింది. తెలుగు, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన మంగ్లీ కి హీరోయిన్ గా అవకాశం వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ దర్శకుడు చక్రవర్తి చంద్రచూడ్ దర్శకత్వం వహిస్తున్న “పాదరాయ”అని కన్నడ సినిమాలో హీరోయిన్గా మంగ్లీ అవకాశం తగ్గించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో నాగ శేఖర్ కథానాయకుడిగా నటించనున్నట్లు తెలుస్తోంది. 2013-2014 సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మంగ్లీ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే మాంగ్లీ స్పందించాల్సి ఉంటుంది.

ఇక సింగర్ గా గుర్తింపు పొందిన మళ్లీ సినిమాలలో ఫోక్ సాంగ్స్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇటీవల రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో కూడా మంగ్లీ పాడిన పాటలు మంచి హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ పాటలు యూట్యూబ్లో ట్రైనింగ్ లో నిలుస్తున్నాయి. ఇలా సినిమాలలో పాటలు పాడటమే కాకుండా పండుగల సందర్భంగా మంగ్లీ చేసే ఆల్బమ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా మంగ్లీ పాడే పాటలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. మంగ్లీ ఇలా ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ సినిమాలలో పాటలు పాడుతూ బిజీగా ఉండటమే కాకుండా ఈవెంట్స్ లో కూడా పాటలు పాడుతూ బిజీగా ఉంటుంది.