ఈ వయసులో తల్లి కాబోతున్న సింగర్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

45 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న సింగర్. ఆమె వేరెవరో కాదు సింగర్ సునీత. సునీత అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. కేవలం 19 ఏళ్లలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన సునీత పాటలు వింటే ఎవరికైనా స్వర్గం అంటే ఏంటో తెలియాల్సిందే. ఆమె మధురమైన గాత్రంతో పాటలు పాడుతుంటే చెవులకు చాలా వినుసంపుగా ఉంటుంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషలలో కూడా ఎన్నో పాటలు పాడిన సునీతకి దక్షిణ భారతదేశంలోనే అంతులేని ఫ్యాన్ బేస్ ఉంది. సుమారు 3000 పాటలకు పైగా పాడిన సునీత 500 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పింది. వీటితోపాటు తెలుగు సింగింగ్ రియాలిటీ షోస్ లలో జడ్జ్ గా బుల్లితెరపై కనిపించి అభిమానులకు మరింత దగ్గర అయింది.

ఇక తన వ్యక్తిగత విషయాలకు వస్తే సునీతకు 19 ఏళ్లలోనే పెళ్లి అయింది. వీళ్ళకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఆకాష్ శ్రేయ. అయితే కొన్ని సంవత్సరాల తరువాత వ్యక్తిగత సమస్యల వల్ల ఇద్దరు విడిపోయారు. మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది సునీత. ఆమె కొడుకు అయిన ఆకాష్ మొన్నే “సర్కార్ నౌకరి” అనే ఒక సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఇలా ప్రొఫెషనల్ గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా సక్సెస్ను కొనసాగించింది సునీత.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సునీత తన రెండో పెళ్లి తర్వాత నుంచి ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంది. 45 ఏళ్ల వయసులో తల్లి కాబోతుంది అన్న వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. వీటిపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా మళ్ళీ ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు సునీత రూమర్స్ క్రియేట్ చేసిన వారిపై ఫైర్ అవుతూనే వచ్చింది అయినా సరే ఇవేమీ ఆగడం లేదని ఇంక వాటిని కేర్ చేయడం మానేసింది.