Singer Sunitha : జనాలు బాగా క్రేజీ అయ్యారు…. తల్లి కాబోతున్న విషయం పై స్పందించిన సునీత…!

Singer Sunitha : 17 ఏళ్లకే ప్లే బ్యాక్ సింగర్ గా అడుగుపెట్టి ఎన్నో పాటలను ఎన్నో భాషలలో పాడిన సునీత తెలుగు నాట పరిచయం అక్కర్లేని సింగర్. మూడువేలకు పైగా పాటలను దక్షిణాది అన్ని భాషలలో పాడిన సునీత కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అనే చెప్పాలి. కానీ వ్యక్తిగతంగా మాత్రం జీవితంలో వడిదుడుకులను ఎదుర్కొని నిలిచింది. చిన్న వయసులో 19ఏళ్లకే కిరణ్ గోపరాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తరువాత వాళ్లిదరు 2017 లో విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇక 2021 లో మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని తో వివాహం జరిగింది. ఇక అటు కెరీర్ ఇటు వ్యక్తిగత జీవితాన్ని బాలన్స్ చేస్తూ ఆప్పుడపుడు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది సునీత. ఇక అప్పుడప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులు చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తుంటారు సునీత. అలా అరటిపండు గెలను కోస్తూ ఫోటోలు పెట్టారు. ఇక ఇపుడు మామడి కాయలను చూపుతూ బ్లెస్సెడ్ అని పోస్ట్ పెట్టడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు.

ఇక చాలా మంది శుభాకాంక్షలు చెప్పారు. తల్లి కాబోతుందంటూ విషెస్ చెప్పారు. ఇక ఈ విషయంపై స్పందించింది సునీత జనాలు చాలా క్రేజీగా ఉన్నారు. తొలిపంట మామిడి అని షేర్ చేశాను. ఇది వేరేలా వెళ్లింది. పుకార్లు దయ చేసి ఆపండి. దండం రా నాయనా అంటూ నెటిజన్స్ కు కౌంటర్ ఇచ్చింది.