వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో తప్పు చేశారో లేదో క్లారిటీ లేదు కానీ ఆయన తప్పు చేశారని ఎక్కువమంది భావిస్తుండటం గమనార్హం. ఈరోజు అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. విచారణలో ఆయన చెప్పే విషయాలు ఈ కేసులో కీలకం కానున్నాయి. అయితే గతంలో ఎప్పుడూ అవినాష్ రెడ్డిని విచారించని అధికారులు ఇప్పుడు విచారించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
మీడియాలో తన గురించి వచ్చిన కథనాలు నిరాధారమని ఆయన చెబుతుండగా ఆ వార్తల్లో నిజా నిజాలు తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. అవినాష్ రెడ్డి నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం కోర్టు నుండి శిక్ష అనుభవించక తప్పవు. మీడియా వల్ల తాను మానసిక వేదనను అనుభవిస్తున్నానని అవినాష్ రెడ్డి కామెంట్లు చేస్తున్నారు. ఈ కేసు వైసీపీ గెలుపు ఓటములను డిసైడ్ చేయనుందని కామెంట్లు చేయనున్నాయి.
అవినాష్ రెడ్డి దోషా? నిర్దోషా? ప్రశ్నకు వేర్వేరు కారణాలు వ్యక్తమవుతున్నాయి. అవినాష్ రెడ్డి నిజంగా నిర్దోషి అని తేలితే అసలు దోషి ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. అయితే అవినాష్ రెడ్డికి విజయమ్మ ఆశీర్వాదం లభించడం గమనార్హం. షర్మిల, సునీత మాత్రం వివేకా హత్య కేసుకు వేగంగా పరిష్కారం దొరకాలని కోరుకుంటున్నారు. సునీత అయితే ఈ కేసు విషయంలో సీరియస్ గా ఉన్నారు.
అవినాష్ రెడ్డి నిజంగా తప్పు చేసి ఉంటే ఆయన రాజకీయాలకు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. సీబీఐ విచారణలో ఆయన నిజంగా తప్పు చేశారో లేదో తేలే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సైతం అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం.