టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ సింగర్లుగా గుర్తింపు పొందిన వారిలో సునీత కూడా ఒకరు. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో సినిమాలలో పాటలు పాడి అందరిని ఆకట్టుకున్న సునీత ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా గుర్తింపు పొందింది. ఇలా సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా సునీతకి మంచి గుర్తింపు ఉంది. దాదాపు 120 మంది హీరోయిన్లకు పైగా డబ్బింగ్ చెప్పిన సున్నిత కొన్ని వందల పాటలను పాడింది . ఇలా సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న సునీత వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఇటీవల తన ఇద్దరు పిల్లలు, తల్లితండ్రుల ప్రోత్సాహంతో రామ్ వీరపనేని అని వ్యక్తి ని రెండవ వివాహం చేసుకుంది.
అప్పటినుండి సునీత గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తన రెండవ వివాహ గురించి వస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యింది. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యల కారణంగా కొంతకాలం డిప్రెషన్లోకి వెళ్లానని అయితే ఆ సమయంలో బాలు గారు నాకు అండగా ఉండి నన్ను మామూలు మనిషిని చేశాడని సునీత చెప్పుకొచ్చింది.
ఈ మేరకు బాలు గారికి ఎప్పుడూ నేను కృతజ్ఞురాలిని అంటూ వెల్లడిస్తూ…ఆయన మరణాన్ని గుర్తుచేసుకొని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇక సోషల్ మీడియాలో తన గురించి విమర్శలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. పనీపాటా, సంస్కారం లేని వ్యక్తులే ఇలా వేరొకరి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతారు..అలాంటి వారి మాటలను నేను పట్టించుకోను అంటూ సమాధానం చెప్పింది. ప్రస్తుతం తన వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సునీత వెల్లడించింది.