శ్రద్దా శ్రీనాథ్ బోల్డ్ గా కూడా ఒకే.. కాని టాలీవుడ్ లో అవకాశాలే ఇవ్వడం లేదు…?

కోహినూర్ అన్న సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో 2015 లో అడుగు పెట్టింది శ్రద్దా శ్రీనాథ్. ఈ సినిమాతో మంచి పేరు సంపాదిచుకోవడంతో ఆ తర్వాత సూపర్ హిట్ సాధించిన కన్నడ సినిమా యూ టర్న్ లో నటించింది. ఈ సినిమాకి ఫిల్మ్ ఫేర్ తో పాటు సైమా అవార్డ్స్ ని అందుకుంది. యూ టర్న్ సినిమాతో టాలెంటెడ్ హీరోయిన్ గా అన్ని చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.

Kannada horror thriller 'U Turn' to be remade in Hindi | The News Minute

ఈ కారణంగానే నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమాతో కూడా శ్రద్దా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ కి ఇక తెలుగులో తిరుగుండదని భావించారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో అవకాశాలు వస్తాయనుకున్నారు. కాని సీన్ రివర్స్ అయింది. జెర్సీ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు ఏవీ రాలేదు.

Nani's Jersey Movie Overseas By BlueSky - Social News XYZ

 

BoycottNetflix trends on Twitter after Telugu film 'Krishna and His Leela'  allegedly displays 'Hinduphobia'

కాని తమిళంలో మాత్రం బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ నేర్కొండ పార్వల్ లో నటించి ఆకట్టుకుంది. తమిళ, కన్నడ సినిమాలు వరకు ఒకే గాని తెలుగులో నే శ్రద్దా పెట్టుకున్న ఆశలు నెరవేరడం లేదు. కాగా రీసెంట్ గా ఓటీటీలో వచ్చిన కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలో బోల్డ్ సీన్స్ కూడా చేసింది. జెర్సీ సినిమాకంటే కంప్లీట్ ఆపోజిట్ రోల్ చేసి తను ఎలాంటి పాత్రలైనా చేయగలనని నిరూపించుకుంది. మరి మేకర్స్ దృష్ఠి శ్రద్దా శ్రీనాథ్ మీదకి ఎప్పుడు మళ్ళుతుందో చూడాలి.