షాకింగ్ : అప్పుడే సుధీర్ బాబు “హంట్” డిజిటల్ రిలీజ్.!

ఈ ఏడాది టాలీవుడ్ సంక్రాంతికి వచ్చిన ఆల్ మోస్ట్ అన్ని సినిమాలు సక్సెస్ కాగా ఇదే ఊపులో సినిమా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “హంట్” కూడా ఒకటి. అయితే ఈ సినిమా దర్శకుడు మహేష్ తెరకెక్కించగా డీసెంట్ టాక్ నే తెచ్చుకుంది. కానీ అనూహ్యంగా ఈ చిత్రం డిజాస్టర్ ఓపెనింగ్స్ ని తెచ్చుకొంది.

దీనితో ఈ సినిమా మరో డిజాస్టర్ కాగా ఈ సినిమా థియేటర్స్ ఎలాంటి వసూళ్లు రాకపోవడంతో చిత్ర మేకర్స్ సినిమా బడ్జెట్ అయినా రికవర్ చెయ్యాలని ఎర్లీ స్ట్రీమింగ్ కి అయితే తీసుకొచ్చేస్తున్నారు. మరి ఈ చిత్రం జస్ట్ 15 రోజుల్లోనే ఓటిటి లో వచ్చేస్తుందట. ఈ సినిమా డిజిటల్ హక్కులని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నారు.

కాగా ఇందులో ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 10 నుంచే స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా సినీ వర్గాల వారు చెప్తున్నారు. ఇది మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో తమిళ యంగ్ నటుడు భరత్ కూడా కీలక పాత్ర చేయగా శ్రీకాంత్ తదితరులు కూడా నటించారు అలాగే జిబ్రాన్ సంగీతం అందించగా భవ్య క్రియేషన్స్ నిర్మాణం అందించారు.