టీజర్ టాక్ : మరో కొత్త కాన్సెప్ట్ తో సుధీర్ బాబు “మామా మశ్చీంద్ర”

ఇప్పుడు మన టాలీవుడ్ హీరోస్ అంతా కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్ వెనుక పడుతున్నారు. సినిమాలో ఏదన్నా కొత్తగా థ్రిల్ చేసే అంశం లేకపోతె ప్రెజెంట్ జెనరేషన్ ఆడియెన్స్ సినిమాకి రావట్లేదని గ్రహించి ఏదొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో అయితే వస్తున్నారు. మరి అలా వస్తున్న హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బావ మరిది సుధీర్ బాబు కూడా ట్రాక్ మార్చాడు.

మరి సుధీర్ బాబు హీరోగా నటించిన గత చిత్రాలు, శ్రీ దేవి సోడా సెంటర్, హంట్ లతో కాస్త కొత్త గానే ట్రై చేసాడు కానీ అవి విఫలం అయ్యాయి. ఇక వీటి తర్వాత కూడా తన ప్రయోగాన్ని ఆపకుండా పెద్ద ప్రయోగాన్నే చేసాడు. ఆ సినిమానే “మామా మశ్చీంద్ర”. అమృతం సీరియల్ ఫేమ్ హర్ష వర్ధన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో సుధీర్ బాబు 3 పాత్రలలో నటించాడు.

కాగా ఈ మూడు రోల్స్ పై కూడా రిలీజ్ చేసిన పోస్టర్ లు ఆసక్తి రేపగా ఇప్పుడు టీజర్ లో అయితే మరింత ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. ఒక సీనియర్ సుధీర్ బాబు లాంటి పాత్ర ఒకటి ఇద్దరు యంగ్ సుధీర్ బాబు లలో ఒకరు నార్మల్ గా మరొకరు లావుగా కనిపిస్తున్నాడు.

వారికి లవర్స్ గా ఈషా రెబ్బ మృణాలిని రవి లు కనిపిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు సుధీర్ బాబు లకి మూడో పాత్రదారుడికి లింక్ ఏంటి? అతను ఈ ఇద్దరినీ ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు అనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా అయితే ఈ టీజర్ ప్రామిసింగ్ గా కనిపిస్తుంది. దీనితో అయినా సుధీర్ బాబు హిట్ కొడతాడా లేదో చూడాలి.
Maama Mascheendra Teaser |Sudheer Babu, Eesha Rebba, Mirnalini Ravi|Harsha Vardhan|Chaitan Bharadwaj