సుధీర్ బాబు.. వేటాడబోయి, బలైపోయాడే.!

యంగ్ హీరో సుధీర్‌బాబు నటించిన ‘హంట్’ సినిమా ఈ మధ్యనే వచ్చింది. ఎప్పుడు వచ్చింది.? ఎప్పుడు వెళ్ళింది.? ప్చ్.. ఎవరికీ తెలియదంతే. సినిమా కోసం ఓ మోస్తరుగా ప్రచారం చేశారు. సినిమాలో కాన్సెప్ట్ అలాంటిది.

చూసినవాళ్ళేమో చీదరించుకున్నారు. పదిమందికి చెప్పారు, సినిమాకి వెళ్ళొద్దని. చాలా అరుదుగానే జరుగుతుంటుందిలా. నిజానికి, సుధీర్‌బాబు సినిమాలు ఎప్పుడోగానీ, ‘తీసికట్టు’ అనేలా వుండవ్. బాగానే వుంటాయ్ ఎప్పుడూ. కానీ, ఈసారి తేడా కొట్టింది. అసలు తమిళ హీరో భరత్ ఎలా ఒప్పుకున్నాడో.? సీనియర్ నటుడు శ్రీకాంత్ ఎలా ఒప్పుకున్నాడో.? అన్నిటికీ మించి సుధీర్‌బాబుని ఈ స్టోరీ ఎలా మెప్పించిందో.?

ఏమోగానీ, ‘హంట్’ దెబ్బకి, సుధీర్‌బాబు మార్కెట్ ఢమాల్ అయిపోయిందిట. ఎంతలా.? ఇకపై, హీరోగా సుధీర్ సినిమాలు చేయడం దండగ.. అనేంతలా. ఇంత డ్యామేజ్ ఎలా జరిగిందబ్బా.?