షాకింగ్ : “టైగర్ నాగేశ్వరరావు” తమిళ్ రిలీజ్ కి ట్విస్ట్.. 

లేటెస్ట్ గా తెలుగు సినిమా నుంచి దసరా కానుకగా వచ్చిన భారీ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ నుపుర్ సనన్ అలాగే గాయత్రీ భరద్వాజ్ లు నటించిన భారీ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు”కూడా ఒకటి కాగా ఈ చిత్రం అయితే భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యింది కానీ అనుకున్న రేంజ్ లో వసూళ్లు రాబట్టినట్టు అనిపించలేదు.

కాగా ఈ చిత్రం అయితే మేకర్స్ పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసారు. అయితే ఈ చిత్రం రిలీజ్ తెలుగు హిందీ రిలీజ్ తప్ప మిగతా భాషల్లో అయ్యినట్టుగా అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ ఊహ్హించని ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రం తమిళ్ లో ఇంకా రిలీజ్ కాలేదు.

ప్రస్తుతానికి తమిళ్ లో కూడా తెలుగులోనే రిలీజ్ కాగా తమిళ్ వెర్షన్ లో రిలీజ్ కాలేదని చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు తమిళ్ వెర్షన్ లో రిలీజ్ కి సిద్ధం అయ్యింది. మేకర్స్ ఈ సినిమా రిలీజ్ ని ఈ మోక్షబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇపుడు అనౌన్స్ చేయడంతో అసలు ఇప్పటివరకు టైగర్ నాగేశ్వరరావు తమిళ్ వెర్షన్ లో అక్కడ రిలీజ్ కాలేదు అని చాలా మందికి తెలియలేదు.

దీనితో ఈ అప్డేట్ తో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి కారణం గత వారంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో ఎఫెక్ట్ తో అయితే ఈ చిత్రం అక్కడ రిలీజ్ కాలేదు అట అందుకే ఒక వారం ఆపి ఇప్పుడు తమిళ్ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు.