కన్నడ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతారా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కన్నడ ఇండస్ట్రీలో చరిత్రలో రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీకి ప్రీక్వెల్ ని ప్రస్తుతం తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.
ఇదిలా ఉంటే మొదటి సినిమాని కేవలం 15 కోట్ల బడ్జెట్ తో రిషబ్ శెట్టి తెరకెక్కించారు. అందుకు అతనికి 5 కోట్ల రెమ్యునరేషన్ దక్కింది. అయితే మూవీ సక్సెస్ ద్వారా భారీ లాభాలని నిర్మాత సొంతం చేసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో రిషబ్ శెట్టి రేంజ్ కూడా మారిపోయింది. ప్రస్తుతం కాంతారా 2 కోసం రిషబ్ శెట్టికి ఏకంగా వంద కోట్ల వరకు రెమ్యునరేషన్ క్రింద గిట్టుబాటు అవుతుందని తెలుస్తుంది. కాంతారా 2 కోసం నిర్మాత విజయ్ కిరంగదూర్ రిషబ్ శెట్టికి ఎకంగ్బా 50 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చినట్లు కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.
ఇక మూవీ రిలీజ్ తర్వాత వచ్చే లాభాలలో కూడా వాటా ఇస్తానని చెప్పినట్లు ప్రచారం నడుస్తుంది. ఇక వేళ అలా వాటా కూడా లభిస్తే ఈ కాంతారా 2కి ఏకంగా వంద కోట్ల వరకు రిషబ్ శెట్టి అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే ఈ రెమ్యునరేషన్ కేవలం హీరోగానే మాత్రమే కాకుండా దర్శకుడిగా, రైటర్ గా కూడా అతనికి వస్తుందని టాక్.
ఒక్క రిషబ్ శెట్టి ఈ స్థాయిలో కాంతారా 2 కోసం తీసుకుంటే, ఇక సినిమా ప్రొడక్షన్ కాస్ట్, మిగిలిన క్యాస్టింగ్ కోసం ఇచ్చే రెమ్యునరేషన్ కలుపుకొని 150 కోట్ల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా మొదటి సినిమా 15 కోట్ల బడ్జెట్ తో తీస్తే దానికి ప్రీక్వెల్ ఏకంగా 150 కోట్లతో తెరకెక్కించడం ఇండస్ట్రీలో మొదటి సారి జరుగుతుందని అనుకోవచ్చు.