అక్కినేని వారి ఫ్యామిలీ అభిమానులు అంతా కూడా ఇప్పుడు సరైన హిట్ కోసం చూస్తున్నారు. నాగార్జున, నాగ చైతన్య, ఇప్పుడు అఖిల్ తో తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ని చూసిన అభిమానులు ఇప్పుడు అన్ని అంచనాలు కూడా నాగ చైతన్య నుంచి రాబోతున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “కస్టడీ” కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా విషయం పక్కన పెడితే అఖిల్ చేసిన రీసెంట్ సినిమా “ఏజెంట్” నెవర్ బిఫోర్ నష్టాలు మిగిల్చి అఖిల్ కి ఒక నైట్ మెర్ గా నిలిచిపోయింది. దీనితో అఖిల్ మరోసారి ప్రయోగాలు చేయడు అనుకుంటే ఇంట్రెస్టింగ్ గా మళ్ళీ అఖిల్ ఇంకో ఎక్స్ పెరిమెంట్ తో రాబోతున్నట్టుగా పెద్ద ఎత్తున రూమర్స్ ఉన్నాయి.
అయితే ఇక అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి షాకింగ్ ప్లానులే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాని యూవీ బ్యానర్ వారు షాకింగ్ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. ఇంతేనా ఏజెంట్ లో మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి ని పెట్టినట్టుగా ఇప్పుడు ఈ సినిమాలో కన్నడ నుంచి ఓ స్టార్ హీరోని అలాగే తమిళ నుంచి మరో స్టార్ నటుణ్ని ఈ సినిమాలో కీలక పాత్రల కోసం ఎంపిక చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
దీనితో అయితే అసలు అఖిల్ తదుపరి సినిమాలపై ఏజెంట్ ఎఫెక్ట్ ఏమీ లేనట్టు ఉన్నాయని చెప్పాలి. అదేంటో కానీ అఖిల్ ప్లాప్ లు అందుకున్నా కూడా మేకర్స్ బడ్జెట్ పెడుతున్నారు సినిమాకి కూడా మినిమమ్ బిజినెస్ జరిగిపోతుంది. ఇదే అఖిల్ కెరీర్ కి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా మెటీరిలైజ్ అవుతుందో చూడాలి.