బాక్సాఫీస్ : “కస్టడీ” కి వరల్డ్ వైడ్ షాకింగ్ ఓపెనింగ్స్.?

అక్కినేని వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హిట్ అండ్ రిలీజ్ అయితే అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సినిమా “కస్టడీ” తో అయితే వచ్చింది. ఈ సినిమా టాక్ మరీ అంత పాజిటివ్ గా రాలేదు అలాగని మరీ అంత నెగిటివ్ టాక్ కూడా రాలేదు.

అయితే ఈ చిత్రం వసూళ్లు కూడా అంత అనుకున్న రేంజ్ లో అదిరే ఓపెనింగ్స్ అయితే రానట్టే ట్రేడ్ వర్గాలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయగా ఈ చిత్రానికి కేవలం 4 కోట్ల మేర మాత్రమే వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తుంది.

అంతే కాకుండా 4 కోట్ల లోపే గ్రాస్ వచ్చినట్టుగా టాక్. అంటే 2 కోట్ల మేర మాత్రమే షేర్ వచ్చినట్టుగా అనుకోవాలి ఇది చాలా చాలా పూర్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఈ చిత్రానికి తెలుగు లోనే 20 కొట్లకి పైగా బిజినెస్ జరిగింది అలాంటిది ఈ చిత్రం ఓపెనింగ్స్ తో ఆ మొత్తం రాబట్టాలి అంటే ఇంకెంత అందుకోవాలో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఉన్న టాక్ అండ్ ఫ్లోటింగ్ తో అయితే ఇది అసాధ్యమే అని చెప్పక తప్పదు. మరి ఓపెనింగ్ డే లోనే అక్కినేని ఫ్యాన్స్ పెద్దగా ఆసక్తి చూపనట్టు ఉన్నారు. మరి మిగిలిన రోజుల్లో ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే అరవింద స్వామి విలన్ గా నటించారు. అలాగే యువన్ శంకర్ రాజా మరియు మాస్ట్రో ఇళయ రాజా లు అయితే ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.