షాకింగ్ న్యూస్: జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సుడిగాలి సుదీర్.. కారణాలు ఇవే!

తెలుగు బుల్లితెర పై గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ అద్భుతమైన రేటింగ్స్ దక్కించుకొని విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ కార్యక్రమం ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎక్కడో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి సుడిగాలి సుదీర్ జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రస్తుతం బుల్లితెర స్టార్ గా మారిపోయిన సుధీర్ జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే జబర్దస్త్ కార్యక్రమం నుంచి సుధీర్ బయటకు రావడంతో పాటు అతనితో పాటు ఎంతో సన్నిహితంగా ఉండే గెటప్ శీను ఆటో రాంప్రసాద్ కూడా బయటకు రావాలని భావించినట్లు తెలుస్తోంది.ఇక ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కమెడియన్స్ ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళిపోతే కార్యక్రమం రేటింగ్ అమాంతం పడిపోతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం జబర్దస్త్ కమెడియన్స్ తో అగ్రిమెంట్ పై సంతకం చేయించుకునే మల్లెమాల సంస్థ ఈ ఏడాది కూడ కమెడియన్స్ తో అగ్రిమెంట్ పై సంతకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయగా సుడిగాలి సుదీర్ అగ్రిమెంట్ పై సంతకం చేయడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

ఇన్ని రోజులు సుడిగాలి సుదీర్ మిగతా కమెడియన్ కేవలం జబర్దస్త్ కార్యక్రమం పై మాత్రమే ఆధారపడి పని చేశారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా వీరికి ఎంతో ఫేమ్ రావడంతో వీరికి ఎన్నో సినిమాలు,మరి ఇతర కార్యక్రమాలలో ఆఫర్లు లభించటం వల్ల కేవలం జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే పరిమితం కాకూడదని భావించినట్లు ఉన్నారు. అందుకోసమే జబర్దస్త్ అగ్రిమెంట్ పై సంతకం పెట్టడం అని చెప్పడంతో ఈ విషయంలో సుడిగాలి సుదీర్ ని ఏమీ అనడానికి కూడా కారణాలు లేకపోవడంతో మల్లెమాల సమస్థ కూడా సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. ఏదిఏమైనా సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్ళిపోతే ఈ కార్యక్రమం పరిస్థితి ఏమిటి అంటూ నెటిజన్లు భావిస్తున్నారు.