షాకింగ్ : “RRR” సినిమా విషయంలో రాజకీయం జరిగిందా..?

ఇప్పుడు సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో రెండు సినిమాల పేర్లు సంచలనంగా మారి వినిపిస్తున్నాయి. మరి వాటిలో ఒకటి మన తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కాగా మరో సినిమా గుజరాత్ కి చెందిన సినిమా ది లాస్ట్ ఫిలిం షో అనే సినిమా పేరు.

అయితే ఈ ఏడాది ఇండియన్ సినిమా నుంచి బెస్ట్ సినిమాల జాబితాలో మన దేశం తరపున అంతా RRR సినిమాని మనవాళ్ళు పంపుతారు అనుకుంటే అసలు ఎవరికీ తెలియనటువంటి ఆ గుజరాతీ సినిమాని ఫెడరేషన్ పంపడడం ఒక్కసారిగా అందరిలో షాకింగ్ గా మారింది.

అయితే ఇదిలా ఉండగా దీనికి కారణం ఏంటి అనేది మాత్రం క్లియర్ గా కూడా లేదు. RRR కొత్త సినిమా అందులోని కొత్త కథ కాగా ది లాస్ట్ ఫిలిం షో ఆల్రెడీ ఒక రీమేక్ పైగా 1990 ల టైం లో వచ్చింది. అప్పుడూ ఆస్కార్ కి పంపారు అలాగే మళ్ళీ అదే సినిమాని ఆస్కార్ కి పంపడం అనేది విడ్డూరంగా మారింది.

దీనితో RRR సినిమాలో ఖచ్చితంగా రాజకీయం జరిగింది అని తెలుగు సినిమాకి భారీ ఆదరణ వస్తుండడంతో ఉత్తరాది నాయకులు ఓర్వలేకపోతున్నారని అందుకే ఇండియన్ సినిమా నుంచి RRR సినిమా పేరుని ఇవ్వలేదని అంటున్నారు. దీనితో ఈ రచ్చ ఇప్పుడు మామూలు లెవెల్లో నడవట్లేదు.