షాకింగ్ : హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం.!

తమిళ సినిమా దగ్గర ఒక అన్ రియల్ భారీ క్రేజ్ ఉన్న హీరోస్ లో అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి అజిత్ ఎలాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉండడు పైగా తన సినిమాలకి ఎలాంటి ప్రీ రిలీజ్ గాని ఆడియో ఫంక్షన్స్ కూడా జరుపుకోడు చాలా నిరాడంబరంగా ఉండే అజిత్ సినిమాలకి వచ్చే రెస్పాన్స్ గాని తన ఫ్యాన్ ఫాలోయింగ్ గాని నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.

కాగా అజిత్ ఇదే క్రేజ్ లో లేటెస్ట్ గా రిలీజ్ చేసిన సినిమానే “తెగింపు”. తమిళ్ లో తూనీవు పేరిట రిలీజ్ చేసిన ఈ సినిమా అజిత్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవగా ఈ సక్సెస్ తర్వాత అజిత్ కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. కానీ ఇపుడు షాకింగ్ వార్త అయితే కోలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.

కాగా అజిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొనడంతో ఇప్పుడు కోలీవుడ్ సినిమా షాక్ కి లోనయ్యింది. అజిత్ తండ్రి సుబ్రమణియన్ ఈరోజు ఉదయం చెన్నై లో అయితే తన తుది శ్వాస విడిచారట. కాగా ఆయన తన వయసుకి సంబంధించి అయితే సమస్యలతో తాను కన్ను మూసినట్టుగా తమిళ వర్గాలు చెప్తున్నాయి.

దీనితో అజిత్ ఫ్యాన్స్ శోక సంద్రంలో మునగగా కోలీవుడ్ స్టార్స్ అయితే అజిత్ పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనకి ధైర్యం చెబుతున్నారు. మరి ఇప్పుడు ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అజిత్ అయితే ప్రస్తుతం చిన్న వెకేషన్ లో ఉండగా త్వరలోనే ఇంటికి చేరుకోనున్నారు.