ఏ సినిమా వుడ్ లో అయినా కూడా స్టార్టింగ్ లో అనౌన్స్ చేసిన సినిమా యూనిట్ తోనే ఆ సినిమా అంతా పూర్తయ్యే వరకు ఆల్ మోస్ట్ ఉంటాయి. కాగా మధ్యలో సినిమాలో టెక్నీషియన్స్ మారడం వంటివి కాస్త అరుదుగానే జరుగుతాయి కానీ ఏకంగా డైరెక్టర్ నే మార్చడం వంటివి మన సౌత్ లోనే జరుగుతాయి అని చెప్పాలి.
తెలుగులో అయితే ఎక్కువగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇలాంటివి జరిగేవి మరి ఇదిలా ఉండగా ఇప్పుడు సౌత్ కి చెందిన మరో బిగ్ స్టార్ హీరో సినిమాకి ఇప్పుడు ఇలాగె జరిగినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా వివరాల్లోకి వెళితే కోలీవుడ్ భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు కాగా అజిత్ రీసెంట్ గా నటించిన తన కెరీర్ 61వ సినిమా తెగింపు భారీ హిట్ అయ్యింది.
కాగా ఈ సినిమా తర్వాత తన కెరీర్ 62వ సినిమాని అయితే దర్శకుడు విగ్నేష్ శివన్ తో కోలీవుడ్ భారీ నిర్మాణాల సంస్థ లైకా వాళ్ళు అత్యంత ప్రతిష్టాత్మకంగా అనౌన్స్ చేశారు. మరి అప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ కొన్ని రోజులు నుంచి అయితే విగ్నేష్ పై మేకర్స్ వేటు వేసినట్టుగా వార్తలు వచ్చాయి.
విగ్నేష్ అజిత్ కి రెడీ చేసిన స్క్రిప్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే మెప్పించే విధంగా రెడీ కాలేదని అందుకే బహుశా వేరే దర్శకుడు అజిత్ 62వ సినిమాని అయితే చేసే ఛాన్స్ ఉందని తెలిసింది. ఇప్పుడు ఇదే నిజం అయ్యింది. మేకర్స్ విగ్నేష్ శివన్ ని అజిత్ సినిమాకి తీసేసారు. కాగా తాను కూడా ఈ సినిమా డైరెక్ట్ చెయ్యట్లేదు అన్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ అప్డేట్ కోలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.
Dir #VigneshShivN has removed #AK62 from his Twitter Bio..
This confirms he will no longer direct #AK62 pic.twitter.com/6Luc1UAaa7
— Ramesh Bala (@rameshlaus) February 4, 2023