అవి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి.. ఇక ఆపండి అంటూ ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేసిన స్టార్ హీరో!

హిట్స్ ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేస్తూ కెరియర్ లో చాలా బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. తమిళ చిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ద స్టార్ హీరో అజిత్ అనే విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా కి కాస్తంత దూరంగా ఉండే అజిత్ తాజాగా తన అభిమానుల కోసం ఒక లేఖ విడుదల చేశారు.

ఆ ప్రకటనలో ఏముందంటే ఇటీవల ముఖ్యమైన కార్యక్రమాలలో, ఈవెంట్లలో నేను కనిపించినప్పుడు అనవసరంగా నన్ను కడవులే అజిత్ అంటూ పలువురు స్లొగన్స్ చేస్తున్నారు. ఈ పిలుపులు నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయి. నేను ఇలాంటివి జీర్ణించుకోలేకపోతున్నాను దయచేసి ఇలా పిలవటం ఆపండి, నా పేరుకు ఇతర బిరుదులను తగిలించడం నాకు ఇష్టం లేదు నన్ను నా పేరుతో పిలిస్తే చాలు.

ఇకపై ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని కోరుతున్నాను, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా హార్డ్ వర్క్ తో ముందుకు సాగండి కుటుంబాన్ని ప్రేమించండి, చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఉండండి అని తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. తన అభిమానులను అజిత్ ఇలా రిక్వెస్ట్ చేయడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా తనకి స్టార్ టైటిల్స్ వద్దని తనని అజిత్ లేదా ఏకే అని పిలవాలని కోరారు. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే విదాముయార్చి అనే చిత్రంలో నటిస్తున్నారు. మాగిజ్ తిరుమేణి డైరెక్టర్ కాగా అర్జున్, త్రిష ఆరవ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ సినిమా హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ కి కాపీ అంటూ ఆ సినిమా ప్రొడ్యూసర్లు మూవీ టీం కి లీగల్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా విడుదలపై సందిగ్ధం ఏర్పడింది.ఇక అజిత్ నటిస్తున్న మరొక సినిమా గుడ్ బాడ్ అగ్లీ. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయక కాగా సునీల్, ప్రసన్న, అర్జున్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది.