సౌత్ ఇండియా మార్కెట్ లో తమిళ్ సినిమా కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకుంటుంది. ఈ ఏడాది పలు భారీ హిట్ చిత్రాలు ఒకొకటి వస్తున్నాయి. మరి అసలు ఈ ఏడాది స్టార్టింగ్ లోనే కోలీవుడ్ లో ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన క్రేజీ క్లాష్ చిత్రాలు వారిసు, తూనీవు లు బాక్సాఫీస్ బ్లాస్ట్ గా నిలిచాయి.
కాగా ఈ చిత్రాల్లో అయితే హీరోలు విలేజ్ మరియు అజిత్ కుమార్ లు నటించగా తమిళ నాట వారికి ఉండే క్రేజ్ కానీ మార్కెట్ గాని మరో లెవెల్ అని చెప్పాలి. దీనితో తమిళ నిర్మాతలు వారికి ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చి సినిమాలు చేసుకునే పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఈ హీరోస్ లో లేటెస్ట్ గా అజిత్ కుమార్ విషయంలో షాకింగ్ బజ్ వైరల్ గా మారింది.
దీనితో అయితే అజిత్ ఇప్పుడు చేస్తున్న సినిమా కాకుండా నెక్స్ట్ చేయబోయే సినిమాకి ఏకంగా 160 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడని సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో తమిళ నాట మాత్రమే కాకుండా సౌత్ ఇండియా మార్కెట్ లోనే ఇది ఓ బిగ్గెస్ట్ నెంబర్ అని సినీ వర్గాలు వారు అంటున్నారు.
అయితే విజయ్ కి రజినీకాంత్ కి కూడా ఇదే లెవెల్లో రెమ్యునరేషన్ లు తమిళ నాట ఇస్తున్నారని టాక్ ఉంది. ఆల్రెడీ విజయ్ లియో చిత్రానికి కూడా 100 కోట్లకి పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నాడని బజ్ ఉంది. మొత్తానికి అయితే పరిస్థితి ఇలా ఉంది.