ఓటిటి : అప్పుడే అజిత్ సినిమాకి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.!

ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం అటు తమిళ్ సినిమాతో పాటుగా మన తెలుగు సినిమా దగ్గర కూడా చాలా కీలకంగా మారింది. చాలా ఏళ్ల తర్వాత అక్కడి బిగ్గెస్ట్ స్టార్ హీరో లు థలా అజిత్ కుమార్ మరియు దళపతి విజయ్ లు హీరోలుగా నటించిన సినిమాలు ఒకే రోజు రిలీజ్ కి వచ్చిన ఈ సినిమాలు భారీ ఓపెనింగ్స్ ని కోలీవుడ్ దగ్గర రాబట్టాయి.

దీనితో ఈ సినిమాలు ఇప్పటికి ఆల్ మోస్ట్ థియేట్రికల్ రన్ ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చాయి. కాగా ఇదిలా ఉండగా ఈ సినిమాల్లో అయితే అజిత్ నటించిన తెగింపు సినిమా తమిళ్ వెర్షన్ తూనీవు అధికారికంగా ఓటిటి లో రిలీజ్ అవ్వడానికి రెడీ అయిపోయింది.

కాగా ఈ సినిమా హక్కులు ప్రముఖ పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేయగా ఇందులో ఈ సినిమా ఇపుడు సినిమా రిలీజ్ అయ్యిన నెల లోపే వచ్చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇంతకీ ఈ సినిమా ఏ డేట్ నుంచి స్ట్రీమింగ్ కానుంది అంటే అది ఈ ఫిబ్రవరి 8 నుంచే అందుబాటులో ఉండనుందట.

కాగా ఈ సినిమా అందులో ఈ చిత్రం తమిళ్ తో పాటుగా అనేక భాషల్లో గ్లోబల్ గా రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఫాన్స్ ఈ సినిమా గ్లోబల్ రిలీజ్ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇంకా ఈ సినిమాని దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించగా మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది. అలాగే జిబ్రాన్ సంగీతం అందించాడు.