లేటెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఆసక్తిగా మారిన అంశాల్లో హైలైట్ గా వినిపిస్తున్న మొదటి అంశం “పుష్ప 2” మాస్ వీడియో సహా ఆ సినిమా ఫస్ట్ లుక్ కోసం వినిపిస్తుండగా మరొకటి అల్లు అర్జున్ కి వచ్చిన బర్త్ డే విషెస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఇద్దరు కలిసి మాట్లాడుకున్న చాట్ అని చెప్పాలి.
అయితే తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వారు అందరికీ అల్లు అర్జున్ అయితే థాంక్స్ చెప్తూ వెళ్ళిపోయాడు. అదే విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్ కి ఆప్యాయంగా బావా అంటూ విష్ చేసాడు. అయితే దీనికి అల్లు అర్జున్ థాంక్స్ చెప్తూ వార్మ్ హగ్స్ అంటూ రిప్లై ఇచ్చాడు.
మరి దీనికి ఎన్టీఆర్ కూడా ఓన్లీ హగ్స్ మాత్రమేనా “పార్టీ లేదా పుష్ప” అంటూ బన్నీ పుష్ప లో డైలాగ్ తో అదరగొట్టి నవ్వాడు అయితే దీనికి మళ్ళీ ఎన్టీఆర్ కి బన్నీ ఏమో “వస్తున్నా” అంటూ ఎన్టీఆర్ 30 సినిమా నుంచి ఎన్టీఆర్ డైలాగ్ తో రిప్లై ఇచ్చాడు. దీనితో ఈ ఇద్దరు మాటలు ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.
అంతే కాకుండా ఈ ఇద్దరి నుంచి ఈ రిప్లై లు అభిమానులకి ఓ రేంజ్ లో కిక్ ఇస్తుండగా మిగతా వారు అయితే అసలు ఈ ఇద్దరి మధ్య ఇంత కెమిస్ట్రీ ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనితో నిన్నటి బిగ్గెస్ట్ హైలైట్స్ లో మాత్రం వీరిద్దరి కన్వో నిలిచింది. కాగా ఈ ట్వీట్ లు ఇపుడు వైరల్ గా మారాయి.
Vasthunna !! 😉
— Allu Arjun (@alluarjun) April 8, 2023
