టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిల్మోగ్రఫీ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న సమయంలో అయితే అవన్నీ డిజాస్టర్స్ అవుతూ వస్తుండడంతో మహేష్ కూడా విస్తుపోయి ఇక రిస్క్ లు లాంటివి వద్దని రొటీన్ సినిమాలే చేయడం స్టార్ట్ చేసాడు.
అయితే ఇలా చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. కానీ మహేష్ ఒళ్ళు హూనం చేసుకున్న సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి. కాగా ఇపుడు మహేష్ పై సోషల్ మీడియాలో పలు షాకింగ్ అలిగేషన్స్ ఒకొకటిగా బయటకి రావడం వైరల్ గా మారడం జరిగాయి.
మరి వీటిలో ఇపుడు మహేష్ అసలు తన సినిమాలకి ఎక్కవ కష్టపడడం లేదని కాస్త ఇబ్బందిగా ఉన్న ఫైట్ సీన్స్ ఉన్నా కూడా ఆ ఫైట్ మాస్టర్ ని మహేష్ మార్చేయాలని అడుగుతున్నాడని అంతే కాకుండా మహర్షి లాంటి సినిమాల్లో ఎండలో షూటింగ్ చేయాల్సి వస్తుంది అని మహేష్ ఏసీ సెట్టింగ్స్ వేసుకొని వాటిలో షూటింగ్ చేసాడని పలు షాకింగ్ అంశాలు బయటకి వచ్చాయి.
అయితే వీటిలో ఎంతవరకు నిజం ఉందో కానీ మహేష్ యాక్షన్ సీన్స్ విషయంలో ఎందుకు అంత హార్డ్ వర్క్ చేయడంలో ఎలాంటి లేదట. గత కొన్నాళ్ల నుంచి మహేష్ మోకాలి నొప్పులతో బాధ పడుతున్నాడు వాటికి ఇబ్బంది కలిగే రేంజ్ లో ఉంటే తప్ప మహేష్ స్కిప్ చేయడం లేదట.
ఇప్పటికే తన జిమ్ లో ఎంతో కష్టపడుతూ కాలికి సంబంధించి వర్కవుట్స్ చేసే వీడియోలు వచ్చాయి. అలాంటిది మహేష్ ఏక్షన్ సీన్స్ లో ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అని అనడంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పాలి. ఐతే ఇప్పుడు మహేష్ పై కావాలనే ఇలాంటి అలిగేషన్స్ చేస్తున్నారని కొన్ని రూమర్స్ ఉన్నాయి.