SSMB29: రాజమౌళి మూవీలో మహేష్ తండ్రిగా ఒకప్పటి స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

SSMB29: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి, స్టార్ హీరో మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలను మించి సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. రెండు షెడ్యూళ్ళు కూడా పూర్తి అయ్యాయి.

త్వరలోనే మూడవ షెడ్యూల్ కూడా మొదలుకానుంది. ఈ సినిమాలో స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో తరచుగా ఈ సినిమాకు సంబంధించి ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఒకప్పటి స్టార్ హీరో నటించబోతున్నారట. ఆ హీరో ఎవరు ఏంటి అన్న విషయానికి వస్తే..

మహేష్ బాబు తండ్రి పాత్రలో ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, స్టార్ హీరో మాధవన్ నటించబోతున్నారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా హీరో మాధవన్ ఇటీవల కాలంలో డిఫరెంట్ పాత్రలు చేస్తూ, ఆ పాత్రల కోసం తన బాడీని, లుక్ ని మార్చుకుంటూ సినిమాల కోసం తెగ కష్టపడుతున్నాడు. దీంతో మహేష్ తండ్రిగా కాస్త ముసలి పాత్రలో కనిపిస్తాడని, అలాగే ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందని, ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టారని సమాచారం. అయితే అంతకు ముందు ఈ పాత్రల కోసం నానా పాటేకర్, విక్రమ్ లను అనుకోని ఇప్పుడు మాధవన్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. రాజమౌళి ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇవ్వట్లేదు.