తమిళ సినిమా దగ్గర ఉన్నటువంటి ఎందరి దిగ్గజ హీరోలు సహా రాజకీయ నాయకుల్లో ప్రముఖ సీనియర్ నటుడు అలాగే రాజకీయ నాయకుడు అయినటువంటి కెప్టెన్ విజయ కాంత్ కూడా ఒకరు. మరి తన సినీ కెరీర్ కి ఎప్పుడో గ్యాప్ ఇచ్చిన విజయ కాంత్ గత కొంత కాలం నుంచి తాను తన పర్సనల్ లైఫ్ మరియు పాలిటిక్స్ లోనే బిజీగా ఉన్నారు.
కాగా విజయ కాంత్ ఇప్పుడు కన్ను మూసారు అనే వార్త మొత్తం తమిళ సినిమా ఇండస్ట్రీని శోకంలో పడేసింది. ఎన్నో ఐకానిక్ సినిమాలు పాత్రలు చేసి తమిళ సినిమా దగ్గర తనదైన ముద్ర వేసిన విజయ కాంత్ ఇండస్ట్రీలో 1979 సమయంలో అలా అడుగు పెట్టగ అక్కడ నుంచి 150 చిత్రాలకి పైగా నటించారు. అలాగే రాజకీయాల్లో కూడా రాణించారు.
కానీ గత కొన్నాళ్ల నుంచి ఆయనకి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది అంతే కాకుండా జస్ట్ కొన్ని రోజులు కితమే తాను కరోనా కి కూడా గురి కావడం మరింత చేదు వార్తగా మారింది. మరి ఈ చికిత్స ఆయన తీసుకుంటూ ఈరోజు డిసెంబర్ 28న 71 వ ఏట తన తుది శ్వాస విడిచారు. దీనితో మొత్తం తమిళ సినిమా దిగ్బ్రాంతికి లోనయ్యింది.
కాగా తమిళ సినీ ప్రముఖులు సహా తెలుగు నుంచి కూడా అనేక మంది సినీ ప్రముఖులు జాతీయ స్థాయి రాజకీయ నాయకులూ కూడా ఆయన మృతి పట్ల సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తన అకాల మరణానికి నివాళిగా తమిళ సినీ పరిశ్రమలో థియేటర్స్ యాజమాన్యం ఇవాళ తమ థియేటర్స్ లో షోస్ క్యాన్సిల్ చేసుకున్నారు. కాగా విజయకాంత్ నటించిన “రమణ” చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి “ఠాగూర్” గా రీమేక్ చేసి సెన్సేషనల్ హిట్ కొట్టారు. ఆ తర్వాత తెలుగులో కూడా విజయకాంత్ కోసం చాలా మందికి బాగా తెలిసింది.