షాకింగ్ : “RRR” నటుడు మృతి..రాజమౌళి ఎమోషనల్ పోస్ట్.!

1121107-rrr

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ గ్లోబల్ హిట్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) ఖండాంతరాలు దాటి భారీ హిట్ అయ్యింది. హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సహా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు భారీ గ్లోబల్ రీచ్ ని ఇచ్చిన ఈ సినిమా యూనిట్ కి ఊహించని విషాద వార్త వచ్చింది.

ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ స్కాట్ దొర గా కనిపించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు “రే స్టీవెన్ సన్” ఊహించని విధంగా మరణించారు అని వచ్చిన వార్త ఒక్కసారిగా తెలుగు ఆడియెన్స్ ని కూడా షాక్ కి గురి చేసింది. మరి నిన్న ఈ విషాద ఘటన చోటు చేసుకోగా ఈ వార్త విన్న చిత్ర యూనిట్ కూడా ఎంతో విచారానికి లోనయ్యారు.

అయితే నిన్న రాత్రి నుంచే చిత్ర యూనిట్ సభ్యులు రే పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేయగా. లేటెస్ట్ గా అయితే రే తో వర్క్ చేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తమ ఇద్దరిపై ఓ ఆన్ లోకేష్ పిక్ పెట్టి ఈ వార్త అసలు నమ్మలేకపోతున్నాను అని చాలా షాకింగ్ గా ఉంది.

రే తమ సెట్స్ లో ఎంతో ఎనర్జిటిక్ గా వైబ్రెంట్ గా ఉండేవారు తనతో వర్క్ చేయడం ఎంతో ఎంజాయ్ చేసానని రాజమౌళి తెలిపారు. వారి కుటుంబం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాని, రే పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని జక్కన్న అయితే ఎమోషనల్ పోస్ట్ చేసారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ నటుణ్ని కోల్పోవడం చిత్ర యూనిట్ కి హాలీవుడ్ సినిమాకి కూడా తీరని లోటు.