ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయి హైప్ ఉన్న చిత్రాల్లో అయితే దర్శకుడు కొరటాల శివ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కెరీర్ లో వస్తున్న రెండో సినిమా కూడా ఒకటని చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ లాంటి సెన్సేషనల్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా ఇది వస్తుండగా దీనిపై కూడా ఎనలేని హైప్ అయితే నెలకొంది.
మరి ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ కానుండగా మొన్ననే గ్రాండ్ ముహూర్తం కూడా జరుపుకుంది. అయితే ఈ సినిమాలో అనేక మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా యాడ్ అవుతూ ఉండగా ఇప్పుడు ఓ షాకింగ్ రూమర్ అయితే ఈ సినిమా విషయంలో తెలుస్తుంది.
కొరటాల ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా వేలు పెడుతున్నట్టుగా నయా టాక్. దీనితో అయితే మళ్ళీ ఆచార్య వైబ్స్ మొదలవుతున్నాయి. ఇంకా షూటింగ్ పూర్తి స్థాయిలో కూడా మొదలు కాలేదు అలాంటప్పుడు అప్పుడే బిజినెస్ లెక్కలో కొరటాల జోక్యం చేసుకుంటున్నారు అనే టాక్ మొదలైంది.
కాగా తన మొదటి సినిమా నుంచి కూడా కొరటాల ఇలాగె చేస్తుండగా లాస్ట్ టైం ఆచార్య షాక్ తో అయితే ఇక మళ్ళీ ఇలాంటి విషయాల్లోకి వెళ్ళరు అని చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాకి షూట్ కూడా స్టార్ట్ కాక ముందే అదే చేతి వాటం కనబరుస్తుండడం తారక్ ఫ్యాన్స్ లో ఒకింత ఆందోళనగా ఇప్పుడు మారింది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.