షాకింగ్ టాక్ : పవన్ సినిమాకి పెద్ద స్కెచ్ వేసిన ఏపీ ప్రభుత్వం.?

గత కొన్నాళ్ల నుంచి కూడా టాలీవుడ్ ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అలాగే ఏపీ ప్రభుత్వానికి నడుమ పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి పవన్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్” తో స్టార్ట్ అయ్యిన రచ్చ “భీమ్లా నాయక్” వరకు కూడా వచ్చింది.

కాగా భీమ్లా నాయక్ కి అయితే ఏకంగా బెటాలియన్ కూడా దిగడం థియేటర్స్ వద్ద ప్రభుత్వ అధికారులు సినిమా రిలీజ్ సమయంలో థియేటర్స్ వద్ద పడిగాపులు అలాగే రిలీజ్ తర్వాత కొందరు రివ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇపుడు ఈ ఏడాది లో పవన్ నుంచి రాబోతున్న మరో సినిమా “బ్రో”.

దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ జూలై లో రిలీజ్ కి సిద్ధంగా ఉండగా పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే లేటెస్ట్ గా మరోసారి పవన్ సినిమాని ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది అని తెలుస్తుంది.

దీని ప్రకారం అయితే కేవలం 99 రూపాయలకే కొత్త సినిమాని ఇంట్లో రిలీజ్ రోజు అది కూడా మొదటి షో తోనే చూసేలా ఓ ప్లాన్ ని తీసుకొస్తున్నారని టాక్ స్టార్ట్ అయ్యింది. అయితే సడెన్ గా ఇలాంటి కొత్త డెసిషన్ లు పవన్ కి సంబంధించిన ఈవెంట్ లు ఉంటేనే గుర్తొస్తాయని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇపుడు టాక్ మొదలై తర్వాత పవన్ సినిమా వచ్చే నాటికి ఇది అమలు లోకి వస్తుంది. లాస్ట్ కి మళ్ళీ తీసేస్తారు అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. గతంలో కూడా పవన్ బర్త్ డే టైం లో కూడా బ్యానర్ లు బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ కొత్త నిర్ణయం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.