కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ గత ఏడాది ఈ లోకాన్ని విడిచిన సంగతి తెలిసిందే. ఈయన మరణంతో ఎంతోమంది అభిమానులు, కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ ఈయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఈయన లేడన్న విషయం తన మేనత్తకు తెలియదట.
ఈ విషయాన్ని పునీత్ కుటుంబ సభ్యులు ఆయన మేనత్త నాగమ్మకు ఇప్పటివరకు తెలియచేయలేదట. కారణం.. అంతకుముందే పునీత్ అన్నయ్య రాజ్ కుమార్ చనిపోవడంతో ఆమె తట్టుకోలేక ఆస్పత్రి పాలైందని.. అందుకే ఇప్పటి వరకు పునీత్ విషయాన్ని తనకు చెప్పకుండా దాచి ఉంచారని తెలిసింది. పైగా ఆమె కోసం పునీత్ ఫోటోలకి పూల మాల కూడా వెయ్యట్లేదని.. ఆమె దగ్గర పునీత్ గురించి కూడా మాట్లాడకుండా ఉంటున్నారని తెలిసింది.