టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ చిన్మయి శ్రీపాద గురించి అందరికీ తెలిసిందే. ఈమె సింగర్ కన్నా పెద్ద ఎత్తున క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంపై నోరు విప్పడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఎంతో మంది బడా బాబుల బాగోతం బయట పెట్టడంతో కెరియర్ కూడా కాస్త వెనకబడిందని చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో కొందరి బాగోతం బయట పెడుతూ వారిని ప్రశ్నించడంతో తనకు ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ఇకపోతే చిన్మయ అప్పటినుంచి నిత్యం సోషల్ మీడియా వేదికగా మహిళలకు సంబంధించిన ఏదో ఒక పోస్ట్ పెడుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.
ఇక నిత్యం సోషల్ మీడియా వేదికగా సమాజంలో ఉన్న మహిళలు తమ సమస్యను ఈమెకి చెప్పుకొని ఈమె సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా చిన్మయి కొందరికి మంచి కావడంతోనే మరికొందరికి చెడ్డ అవుతున్నారు. ఇలా నిత్యం మహిళలకు మద్దతుగా వారిపై జరుగుతున్న దాడులను ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున ఈమె వివాదాల్లో నిలుస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత జీవితం గురించి ఒక వీడియో చేశారు.
ఈ వీడియోలో భాగంగా చిన్మయి తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను తన భర్త ఎప్పటి నుంచో పేరెంట్స్ కావాలని కలలు కన్నాము అయితే అదే సమయంలో కరోనా రావడంతో అయోమయ పరిస్థితిలలోకి వెళ్లిపోయామని ఈమె తెలిపారు.ఆ సమయంలో ఒక గైనకాలజిస్ట్ ను సంప్రదించగా బయట ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించడం మంచిది కాదని కాస్త సమయం వేచి ఉండమని ఆమె సూచించారు.కరోనా కాస్త తగ్గుముఖం పట్టగానే మేము పిల్లల గురించి ప్లాన్ చేస్తాం అయితే మూడు నెలలు గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ జరిగిపోయింది. ఆ సమయంలో నేను మానసికంగా ఎంతో కృంగిపోయానని ఎమోషనల్ అయ్యారు.. అనంతరం తాను ప్రెగ్నెన్సీ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని తిరిగి ప్రెగ్నెంట్ అయ్యానని ఇలా కవల పిల్లలకు జన్మనిచ్చానని చిన్మయి ఈ సందర్భంగా తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చారు