Atlee- Chinmayi: అట్లీ స్కిన్ కలర్ పై అలాంటి కామెంట్స్ చేసిన కమెడియన్.. షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన సింగర్ చిన్మయి!

Atlee- Chinmayi: తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కి సంబంధించిన ఒక వీడియో, కొన్ని వార్తలు చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వరుణ్ ధావన్ తో అట్లీ తెరకెక్కించిన బేబీ జాన్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కపిల్ శర్మ కామెడీ షోకు హాజరయ్యారు అట్లీ. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్న అట్లీకి పలు ప్రశ్నలు సంధించాడు కపిల్. అన్నిటికీ ఎంతో ఓపికగా నవ్వుతూ సమాధానం చెప్పాడీ క్రేజీ డైరెక్టర్. అదే సమయంలో స్కిన్ కలర్ ను ఉద్దేశిస్తూ.. మీరు ఎవరైనా స్టార్‌ను కలిసినప్పుడు.. మిమ్మల్ని అట్లీ ఎక్కడ అని అడిగారా అంటూ అట్లిని అవమానించే విధంగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

వెంటనే రియాక్ట్ అయిన అట్లీ సదరు కమీడియన్ కు దిమ్మతిరిగే విధంగా సమాధానం ఇచ్చారు. నువ్వు అడిగిన ప్రశ్న నాకు అర్థం అయింది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా ఏఆర్‌ మురుగదాస్‌కి కృతజ్ఞతలు చెప్పాలి. నా మొదటి సినిమా ఆయనే నిర్మించారు. స్క్రిప్ట్ అడిగారు. కానీ నేను ఎలా ఉన్నానో ఎప్పుడూ చూడలేదు. నా స్క్రిప్ట్ నేరేషన్ ఆయనకు బాగా నచ్చింది. ఎందుకంటే అతను నా స్క్రిప్ట్, నా సామర్థ్యం మాత్రమే చూశారు. అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ మాత్రమే నచ్చింది.

 

ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి అంచనా వేయకూడదు. మీ మనసుతో మాత్రమే స్పందించాలి అని కపిల్ కు కౌంటర్ ఇచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద సైతం స్పందించింది. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. కామెడీ పేరుతో అతని స్కిన్ కలర్ గురించి మాట్లాడడం దారుణం. ఈ విపరీతమైన హేళనలను వాళ్లు ఎప్పటికీ ఆపలేరేమో. కపిల్ శర్మ బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. అతను ఇలా కామెంట్స్ చేయడం నన్ను నిరాశపరిచింది. దురదృష్టవశాత్తూ ఆశ్చర్యం కలగక మానదు అని ట్వీట్ చేసింది చిన్మయి శ్రీపాద. ఆ పోస్టుపై నెటిజన్స్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కపిల్ శర్మ పై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.