పాపం.. నటి రోహిణి జీవితంలో మర్చిపోలేని విషాదం అదేనా?

రోహిణి దక్షిణ భారత సినీ నటి, డబ్బింగ్ కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త, రచయిత. బాల్య నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన రోహిణి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో నటించింది. 1968లో విశాఖపట్నంలో జన్మించింది. ఈమెకు ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు. నటుడు రఘువరన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు సంతానం. 2003లో విడాకులు తీసుకుంది.

ఈమెకు నాలుగు సంవత్సరాల వయసులోనే తల్లి చనిపోవడం జరిగింది.ఆ తర్వాత
కుటుంబమంతా చెన్నైలో స్థిరపడింది. తన తండ్రికి నటనపై ఆసక్తి ఉండడంతో అవకాశాల కోసం తిరుగుతున్న తండ్రి తో పాటు తాను కూడా వెంట వెళ్లేది. అలా బాలనాటిగా యశోద కృష్ణ సినిమాలో అవకాశం వచ్చింది. తండ్రికి కూడా సినిమాలపై ఆసక్తి ఉండడంతో అభ్యంతరం చెప్పకుండా ప్రోత్సహించాడు.

కొంతకాలం అవకాశాలు వచ్చి తగ్గడంతో మూడు సంవత్సరాల తర్వాత కక్క అనే మలయాళ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. రఘువరన్ ని తొలిసారి చూసింది అక్కడే. ఈ సినిమా విజయం సాధించి మలయాళంలో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక తెలుగు తమిళంలో కూడా అవకాశాలు రావడంతో నటిస్తూ డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేస్తూ ప్రైవేటుగా ఆంగ్లంలో ఎం.ఏ పూర్తి చేసింది.

ఇక డబ్బింగ్ ఆర్టిస్టుగా పలు సినిమాలకు తన స్వరాన్ని అందించింది. 1995లో ఈమె నటించిన స్త్రీ సినిమా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఉత్తమ నటిగా అవార్డు తీసుకుంది కానీ ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఇక సినిమాలలో పలు పాత్రలో కూడా నటించి మెప్పించింది. ఇక ఆమె జీవితంలో భర్తకు దూరమైనప్పటికీ కూడా చిన్న వయసులోనే రఘువరన్ చనిపోవడం చాలా బాధాకరమని, వారి ఇద్దరి తీపి గుర్తుగా పుట్టిన బాబు తనకు ప్రాణం అని, రెండో పెళ్లి చేసుకోకుండా కొడుకును ప్రాణంగా చూసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది.