‘మహాసముద్రం’లో అదిరిపోయిన శర్వా లుక్ !

టాలీవుడ్ నటుడు శర్వానంద్ అందరిలా కాదు. ఎప్పుడూ మూసపాత్రలే చేసే హీరోల్లా కాకుండా.. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం పరితపించే నటుడు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా పాత్రకోసం ఏమైనా చేస్తాడు. ఈరోజు శర్వానంద్ తన 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషేస్ తెలుపుతున్నారు. ఇక అది అలా ఉంటే ఆయన ప్రస్తుతం శ్రీకారం, మహా సముద్రం అనే చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

Image

శ్రీకారం మూవీ ట్రైలర్ రీసెంట్‌గా విడుదల కాగా, ఇది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈ రోజు శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తోన్న మల్టిస్టార్రర్ మూవీ మహా సముద్రం నుండి శర్వానంద్ లుక్ విడుదల చేశారు. చేతిలో ఇనుప ఆయుధం పట్టుకొని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు శర్వా. ఈ పిక్ అభిమానులతో పాటు నెటిజన్స్‌కు ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత నటుడు సిద్ధార్ధ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమాను ఆర్ఎక్స్ 100 చిత్రంతో కమర్షియల్ సక్సెన్‌ను అందుకున్న డైరెక్టర్‌ అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్‌ లవ్ అండ్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న విడుదలకానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నారు. మహాసముద్రంను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు చైతన్‌ భరద్వాజ్‌ అందిస్తున్నాడు. ఇక శర్వానంద్ గతేడాది సమంతతో కలిసి తమిళ సూపర్ హిట్ సినిమా 96ను తెలుగులో జాను పేరుతో వచ్చిన రీమేక్‌లో నటించి ప్రశంసలు అందుకున్నాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.