కౌన్సిలింగ్ కి హాజరు కాని షణ్ముఖ్…పోలీసులు సీరియస్ !

ఈ మద్యే హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10లో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ నడుపుతున్న కారు అదుపుతప్పి మరో రెండు కార్లు, రెండు బైక్‌లను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు కూడా.

Shanmukh Jaswanth: ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌కు పోలీసులు కౌన్సిలింగ్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు యాక్సిడెంట్ కేసు కూడా !

దీంతో షణ్ముఖ్‌ జశ్వంత్‌ కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా 170 రీడింగ్ వచ్చింది. దీంతో ఐపీసీ సెక్షన్ 337, 279 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడికి డ్రంక్ డ్రైవ్‌కు సంబంధించిన కేసు మాత్రమే కాకుండా.. యాక్సిడెంట్‌కు సంబంధించిన కేసు కూడా నమోదు చేశారు. కాగా షణ్ముఖ్‌కు త్వరలో పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించదానికీ పోలీసులు నోటీసులు ఇఒచ్చారు. అయితే ఆ నోటీసులు ప్రకారం ఆయన కౌన్సిలింగ్ కి హాజరు కాలేదని అంటున్నారు. దీంతో పోలీసులు కోర్టు ప్రొసీడింగ్స్ కి సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు.

కాగా, షణ్ముఖ్‌ జశ్వంత్ ‘వైవా’, ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అటు ‘సూర్య’ అనే మరో వెబ్ సిరీస్‌ను షణ్ముఖ్‌ జస్వంత్ ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశాడు. ఈ రెండు సిరీస్‌లు కోట్లలో వ్యూస్ రాబడుతున్నాయి. అంతేకాదు.. తెలుగు హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ కవర్ చేస్తూ కూడా గుర్తింపు పొందాడు. యూట్యూబ్‌లో షణ్ముక్ ఫాలోవర్స్ దాదాపు మూడు కోట్ల మంది ఉన్నారంటే అతని ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, తాజాగా షణ్ముక్ బిగ్ బాస్ ఫేమ్ దీప్తీ సునైనాతో ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో ఓ వినోద కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఆమెతో ప్రేమ ప్రయాణం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.