దీప్తి సునయన షణ్ముఖ్ సంగతి సోషల్ మీడియాలో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ విషయం అందరికీ తెలిసిందే అయినా ఎక్కడా ఎవ్వరూ కూడా అధికారికంగా మాత్రం చెప్పరు. బయట వచ్చే షోల్లోనూ ఎక్కడా కనిపించరు. అయితే ఈ మధ్య షణ్ముఖ్ మీడియా ముందుకు వచ్చినప్పుడు ప్రేమకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. అందరికీ తెలిసిందేగా అంటూ తెలివిగా తప్పించుకున్నాయి.
అయితే షణ్ముఖ్ ఎలాంటి వాడన్న సంగతి అతని ఫాలోవర్లకు తెలిసిందే. బహు మొహమాటస్తుడు.. పలుకే బంగారామాయేరా.. అనే టైపు. ఎక్కువగా మాట్లాడడు. మితభాషి. ఏది మాట్లాడినా కాస్త సిగ్గుపడుతూనే ఉంటాడు. ఎక్కువగా ఎవ్వరితోనూ కలిసిపోడు. అయితే తాజాగా షణ్ముఖ్ దీప్తి సునయన ఇద్దరూ కూడా స్టార్ మాలో వస్తోన్న 100 పర్సెంట్ లవ్ అనే షోలో వచ్చారు. ఇందులో చాలానే విషయాలు బయటకు వస్తున్నాయి.
ఎప్పుడూ ప్రపోజ్ చేయాలనిపించలేదని షణ్ముఖ్ చెప్పడం.. ఎందుకు అనిపించలేదని దీప్తి సునయన అనడం.. ఇచ్చిన 21 గిఫ్ట్స్‌లో ప్రేమ ఉందని చెప్పడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మాత్రం మరో విషయం చెప్పింది దీప్తి సునయన. షణ్ముఖ్ అంటే ఎందుకు ఇష్టమంటే అదిరిపోయే సమాధానం చెప్పింది. నన్ను ఎప్పుడూ నవ్విస్తాడు అని చెప్పుకొచ్చింది. ఏం నవ్విస్తాడు ఎప్పుడూ సిగ్గు పడుతూనే ఉంటాడు కదా? అని కౌంటర్ వేశారు. అవన్నీ నా ముందే చేస్తాడు వేరే వాళ్ల ముందు చేయడు అని అసలు విషయం బయటపెట్టేసింది.
Beautiful Reel Couples and Dynamic Real Couples madhya Love fight…Title evaridi?
‘100% Love’ today at 6 PM on @StarMaa#SundayFunday #100PercentLove pic.twitter.com/BWkXYqMOiM
— starmaa (@StarMaa) February 20, 2021