సూర్య‌కు క‌రోనా పాజిటివ్.. అన్న‌య్య ఆరోగ్యంపై తాజా అప్‌డేట్ ఇచ్చిన కార్తి

గ‌త ఏడాది ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించిన క‌రోనా మ‌హ‌మ్మారి ఈ ఏడాది కాస్త శాంతించిన‌ట్టు క‌నిపిస్తుంది. పోయిన ఏడాది క‌రోనా వ‌ల‌న చాలా మంది సెల‌బ్స్ క‌న్నుమూశారు. వారి మ‌ర‌ణం ఇండ‌స్ట్రీకు తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. అయితే క‌రోనా కాస్త చ‌ల్ల‌బ‌డింద‌ని సినిమా స్టార్స్ షూటింగ్స్ చేస్తున్న క్ర‌మంలో కొద్ది మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా త‌మిళ స్టార్ హీరో సూర్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని సూర్య త‌న సోష‌ల్ మీడియా ద్వారా అఫీషియ‌ల్‌గా చెప్పుకొచ్చారు.

సూర్య త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని చెప్పేస‌రికి ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందారు. ఆయ‌న ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సూర్య సోద‌రుడు కార్తి త‌న సోష‌ల్ మీడియా ద్వారా అన్న‌య్య ఆరోగ్యంకు సంబంధించి హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం సూర్య ఫిబ్ర‌వ‌రి 11న డిశ్చార్జ్ అయ్యారు. అన్న‌య్య ఆరోగ్యం బాగుంది. ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. మీ అంద‌రి ఆశీస్సులు, ప్రార్థ‌న‌ల‌కు థ్యాంక్స్ చెప్ప‌డం చిన్న మాట అని కార్తీ ట్వీట్ చేశారు.

కార్తీ ట్వీట్‌తో అభిమానులు కాస్త ఊర‌ట చెందారు. త్వ‌ర‌లో త‌మ అభిమాన న‌టుడు మ‌ళ్ళీ సినిమాల‌తో అల‌రించ‌నున్నాడ‌ని తెలిసి ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవలే ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా, వెట్రిమారన్, సూరుతై శివ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. ఆకాశ‌మే నీ హ‌ద్దురా అనే చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమాకు నెటిజ‌న్స్‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.