ఓటీటీలో మొదలు కానున్న షణ్మఖ్ సందడి.. డిటెక్టివ్ ఏజెంట్ గా రానున్న షన్ను?

ప్రముఖ యూట్యూబ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోస్ తో ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. ఈ బిగ్ బాస్ ద్వారా షణ్ముఖ్ మరింత పాపులర్ అయ్యాడు. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లినవారు డబ్బుతో పాటు మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. షణ్ముఖ బిగ్ బాస్ కి వెళ్లడం ద్వారా నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో సిరి హనుమంత్ తో కలిసి షణ్ముఖ్ హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల ప్రేక్షకులలో ఉన్న పాపులారిటీ తగ్గి షణ్ముఖ మీద నెగెటివిటీ పెరిగింది.

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ఉన్నంతకాలం అతనికి సపోర్ట్ చేసిన అతని ప్రేయసి దీప్తి సునైనా షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగానే అతనికి బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ సిరి తో కలిసి చేసిన పనుల వల్ల ఐదు సంవత్సరాల తమ రిలేషన్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత దీప్తి, షణ్ముఖ్ ఇద్దరు ఎవరి పనుల్లో వారు బిజిగా ఉన్నారు. తాజాగా షణ్ముఖ్ ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. షణ్మఖ్‌ జస్వంత్‌ హీరోగా నటిస్తున్న ఎజెంట్ ఆనంద్ సంతోష్ అను వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ కి అరుణ్‌ పవార్‌ దర్శకత్వం వహించగా.. సత్యదేవ్‌ చెడ్డ, వందన, ఇన్ఫినిటమ్‌ నెటవర్క్‌ సొల్యూషన్స్‌ సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు.

షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈ వెబ్ సిరీస్ జులై 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో షణ్ముఖ్ ఆనంద్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఆనంద్ డిటెక్టివ్‌ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో భాగంగా షణ్ముఖ్ ఒక డిటెక్టివ్‌ ఏజెన్సీలో చేరుతాడు. ఈ క్రమంలో షణ్ముఖ్ ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఇక తనకు ఎదురైనా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని షణ్ముఖ్ తన స్నేహితునితో కలిసి ఎలాంటి కేసులు పరిష్కరించారో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది.