చిన్న చిన్న పాత్రలతో సినీ కెరియర్ మొదలుపెట్టిన సత్యదేవ్ ఇప్పుడు హీరోగా ఎదిగి హిట్స్ అందుకుంటున్నాడు. ముకుంద, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన సత్యదేవ్ జ్యోతిలక్ష్మి సినిమా ద్వారా క్రేజ్ తెచ్చుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా భారీగానే అభిమానులని సంపాదించుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో.
తాజాగా అతను జీబ్రా సినిమాతో మనందరి ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సత్యదేవ్, ధనుంజయ్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేస్తోంది. సస్పెన్స్ జానర్లో బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదల అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.
ఇక ఈ సినిమా ఈనెల 20 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఆహా గోల్డ్ సబ్క్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రం 48 గంటలు ముందుగానే ఈ సినిమా అందుబాటులోకి రానుంది.దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆహా ఓటీటీ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళల్లో లక్కీడ్రా తీసి అందులో వచ్చిన వాళ్లకు సత్యదేవ్ ఫేవరేట్ వాచ్, గ్లాసెస్ ఇస్తామని ప్రకటించారు.
వాటిని సత్యదేవ్, సునీల్ చేతుల మీదుగా అందచేస్తామని ప్రకటించారు. నార్మల్ ప్లాన్ ఉన్నవారు డిసెంబర్ 20 నుంచి ఈ సినిమాని ఆహా లో చూడవచ్చు. ఇక కథ విషయానికి వస్తే రెండు వేర్వేరు బ్యాంకుల్లో పని చేసే సూర్య, అతని గర్ల్‌ఫ్రెండ్ స్వాతి, ఓ మల్టీ మిలియనీర్ ఆది చుట్టూ తిరిగే కథ ఇది. బ్యాంకులో స్వాతి చేసిన తప్పిదం తర్వాత ఆమెతోపాటు సూర్యను కూడా ఎలాంటి చిక్కుల్లో పడేసిందన్నది ఈ జీబ్రా మూవీలో చూడొచ్చు.