ఒక్క సాంగ్ @16 కోట్లు..జస్ట్ శంకర్ థింగ్స్..!

ఇండియన్ సినిమా దగ్గర ఎలాంటి కాపీ లు లేకుండా భారీ చిత్రాలు చేసే దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది తమిళ్ ప్రైడ్ దర్శకుడు శంకర్ అనే చెప్పాలి. శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే ఎన్నో భారీ విజువల్ వండర్స్ వచ్చాయి. ఆఖరికి స్నేహితుడు లాంటి సింపుల్ సినిమాకి కూడా శంకర్ తన గ్రాండియర్ ని తోడు చేసి సినిమాలో హైలైట్స్ సెట్ చేశారు.

అలాంటి శంకర్ చిత్రాల్లో కాన్సెప్ట్ ఏక్షన్ ఇవి పక్కన పెడితే ఓ రేంజ్ లో హైలైట్ అయ్యేది సాంగ్స్ అని చెప్పాలి. తన కెరీర్ మొదటి నుంచి చూసినా కూడా శంకర్ సినిమాలో పాటలు ఒక పాత్ బ్రేకింగ్ గా ఉంటాయి. తన విజనే వేరు అనేలా ప్లాన్ చేసే ఈ సాంగ్స్ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి డైరెక్ట్ సినిమాతో రాబోతున్నాయి.

అయితే శంకర్ సినిమాలో సాంగ్స్ కె భారీ బడ్జెట్ పెడుతూ ఉంటారు. మరి ఇపుడు రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ అనే ఒక సినిమాలో సాంగ్ కి అక్షరాలా 16 కోట్లు ఖర్చు చేశారట. అది కూడా లీక్ అయ్యిన జరగండి సాంగ్ కోసం పెట్టారట. ఈ సాంగ్ పోస్టర్ చూసినప్పుడే దిల్ రాజు ఖర్చు కనిపించేసింది.

దీనితో ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. అలాగే చాన్నాళ్ళకి శంకర్ మార్క్ మళ్ళీ చూడబోతున్నామని కూడా అంతా అంటున్నారు. మరి ఈ దీపావళి కానుకగా వచ్చే ఈ సాంగ్ మాత్రం ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.