ఇండస్ట్రీ టాక్ : షాకింగ్ బడ్జెట్ తో శంకర్ కొత్త మల్టీ స్టారర్.?

991953-director-shankar

ఇండియన్ సినిమా దగ్గర ఉన్న టాప్ దర్శకుల్లో తమిళ సెన్సేషన్ దర్శకుడు శంకర్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను క్రియేట్ చేసిన ఎన్నో వండర్స్ హాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి కూడా తన వర్క్ ఇన్ స్పైర్ చేసింది. దీనితో శంకర్ ప్లాప్స్ లో ఉన్నప్పటికీ తన విజన్ పై మాత్రం ఇప్పటికీ చాలా మందికి గట్టి నమ్మకం ఉంది.

దీనితో ఇప్పుడు తాను చేస్తున్న రామ్ చరణ్ తో సినిమాపై కూడా గట్టి హైప్ ఉంది. అయితే దీని తర్వాత శంకర్ చేసే సినిమాలు ఏంటి అనే ప్రశ్న వస్తే పలు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తారని టాక్ ఉంది. కాగా మొదట రామ్ చరణ్, యష్, హృతిక్ రోషన్ ఇలా కొంతమంది పేర్లు వచ్చాయి.

కానీ ఇప్పుడు సినీ వర్గాల్లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ఇప్పుడు శంకర్ అయితే ఏకంగా 900 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది కూడా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ మరియు తమిళ స్టార్ విజయ్ తో తాను చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ ఏక్షన్ డ్రామాగా ఉంటుంది అని ఇండస్ట్రీ టాక్.

అయితే శంకర్ ఇది వరకు ఓ స్కై ఫై సినిమాని తాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి బహుశా అది ఇదేనా కాదా అనేది మాత్రం ఇంకొంత కాలం ఆగి చూస్తే తెలిసిపోతుంది. ప్రస్తుతం అయితే శంకర్ ఇండియన్ 2 మరియు రామ్ చరణ్ సినిమాలు ఏక కాలంలో కంప్లీట్ చేస్తూ బిజీగా ఉన్నారు.