RC15 – టైటిల్ కోసం శంకర్ ఆసక్తికర ప్లాన్స్..?

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు భారీ పాన్ ఇండియా లెవెల్ చిత్రాల్లో గ్లోబల్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం కూడా ఒకటి. ప్రస్తుతం తన కెరీర్ లో 15వ సినిమాగా అందులోని ఇండియన్ జేమ్స్ కామెరాన్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది.

కాగా ఈ సినిమా ఇప్పుడు సుమారుగా 70 శాతం కంప్లీట్ అవ్వగా ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ మరియు సినిమా టైటిల్ కోసం అయితే అభిమానులు శంకర్ సినిమాల కోసం తెలిసిన వారు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ అవైటింగ్ ఫస్ట్ లుక్ అయితే ఈ మార్చ్ 27 చరణ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ఇపుడు రూమర్స్ గట్టిగా వినిపిస్తూ ఉండగా.

సినిమా మరి ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ మరొకటి ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. శంకర్ ఈ సినిమాకి అన్ని భాషల్లోని ఒకే టైటిల్ పెడతారా లేక ఒకో భాషలో ఒకో టైటిల్ తో ప్లాన్ చేస్తున్నారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అలాగే అభిమానులు అయితే సింగిల్ వెర్షన్ టైటిల్ ని అన్ని భాషల్లో కోరుకుంటున్నారు.

మరి శంకర్ అయితే ఎలాంటి ప్లాన్ చేశారు అనేది వేచి చూడాలి. కాగా ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు అలాగే థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వచ్చే ఏడాది అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్లాన్ చేస్తున్నారు.